| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నవతరమా! నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో!

నవతరమా! నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో!

నషా ముక్త్ భారత్ అవగాహన సదస్సులో యువతకు కీర్తిరెడ్డి పిలుపు!

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నషా ముక్త్ భారత్ అవగాహన సదస్సు జరిగింది!

డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా చేపట్టిన "నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్" సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు!

ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి, పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు!

ఈ సదస్సులో వక్తలుగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ డీజీపీ దినేష్ కుమార్, డాక్టర్ పి బి సుధాకర్ రావు, ప్రొఫెసర్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్, డాక్టర్ సిద్దార్థ, మాజీ మేజర్ జనరల్ వి ఆర్ మహేందర్ తమదైన సందేశాన్ని ఇచ్చారు!

ప్రత్యేక ఆకర్షణగా స్కిట్!

నషా, డ్రగ్స్ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయన్న అంశంపై కళ్లకు కట్టినట్లుగా వేసిన స్కిట్ అతిథులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది! నషా ముక్త్ భారత్ సాధనలో మేము సైతం భాగస్వాములం అవుతామంటూ ప్రముఖులు, బీజేపీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు!

వక్తల సందేశం!

ఈ దేశానికి యువతరమే తరగని ఆస్తి! ఆల్కహాల్, డ్రగ్స్ ఈ రోజుల్లో ఫ్యాషన్ అనుకోవడం సరికాదు! ఒక్కసారి మీరు ఆ మత్తులో పడితే మీ జీవితాలే కాదు, మీ మీ కుటుంబాలు, సొసైటీకే పెద్ద నష్టం! స్నేహితులు ప్రోత్సహిస్తేనో, చేదు అలవాట్లకు మరిగితే మీరు జీవితంలో కోలుకోలేని ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు! పేరెంట్స్ కూడా పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి!

డ్రగ్స్ అనే మహమ్మారి చాపకింద నీరులా ఈ దేశంలో వేళ్లూనుకుపోతుంది! మనమంతా అన్ని కోణాల్లో దీని ప్రభావాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్ తరాన్ని, ఈ దేశ విలువైన సంపదను కోల్పోతాము! డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది సామాజిక సమస్య! అందుకే ఈ డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు ఒక్క పోలీసులు, డాక్టర్లు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది!

ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధిలో దూసుకుపోతుంటే, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఓర్వలేక పోతున్నాయి! అందుకే కొన్ని విదేశీ కుట్రలు ఈ దేశ యువతరాన్ని మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్నాయి! ఇది నార్కోటిక్ టెర్రరిజమే! దీన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉన్నది!

యువతరమా మేలుకో!

యువత ఆలోచన ధోరణి మారాలి! ఈ దేశ భవిష్యత్ మీదే! ఒక్క రాంగ్ స్టెప్ వేసినా మీ జీవితాలను, మీ కుటుంబాలను మీరే నాశనం చేసుకుంటారు! అందుకే మీరంతా ఆలోచించి డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి! కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈ "నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్" సాధనలో మీరంతా భాగస్వాములు కావాలి! మీ మీ పరిధిలోని స్కూల్స్, కాలేజీలలో చాక్లెట్స్ ముసుగులో సాగుతున్న డ్రగ్స్ ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి! డ్రగ్స్ వినియోగం, అనర్థాలపై ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించాలి! ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకోగలము!

మీరు తలచుకుంటే సాధించలేనిది ఏముంది! యువత ఆలోచించి అడుగులు వేస్తే, ఈ దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే!

#DailyBharath #Hyderabad #NashaMuktBharat #KishanReddy #KeerthiReddy #DrugsFreeSociety

Previous భారత వ్యతిరేక శక్తులతో "భారత్ సమ్మిట్" నిర్వహించడం దారుణం! బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి!
Next రాజన్న సిరిసిల్ల : హాస్టళ్ల మూసివేతపై టీఆర్ఎస్వీ ఫైర్! విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు!
ADVERTISEMENT