| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పనిచేస్తున్న సంస్థకే కన్నం! రూ 1.62 కోట్ల టవర్ పరికరాలు చోరీ! 9 మంది అరెస్ట్!

పనిచేస్తున్న సంస్థకే కన్నం! రూ 1.62 కోట్ల టవర్ పరికరాలు చోరీ! 9 మంది అరెస్ట్!

డైలీ భారత్, నల్లగొండ: అన్నం పెట్టిన సంస్థకే సున్నం పెడుతూ, ఎయిర్ టెల్ సెల్ టవర్లలోని అత్యంత ఖరీదైన రేడియో రిమోట్ యూనిట్లను చోరీ చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను నల్లగొండ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు!

ఈ ముఠాలో ప్రస్తుతం అదే సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు ఇంజినీర్లు, నలుగురు టెక్నీషియన్లు, రిగ్గర్లు, ఒక డ్రైవర్ తో పాటు గతంలో పనిచేసి మానేసిన మరో మాజీ ఉద్యోగి ఉండటం గమనార్హం!

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడి, సుమారు రూ 1.62 కోట్ల విలువైన పరికరాలను అపహరించిన ఈ ముఠా వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం నల్లగొండ డీపీఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు!

వాహన తనిఖీల్లో గుట్టురట్టు!
త్రిపురారం మండలం కామారెడ్డి గూడెం, నల్లగొండ రూరల్ పరిధిలోని మెల్లదుప్పలపల్లి గ్రామాల్లో ఉన్న మొబైల్ టవర్లకు చెందిన ఆర్ ఆర్ యూలు చోరీకి గురయ్యాయి! మహమ్మద్ యౌసుఫ్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిపురారం, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లలో బీఎన్ ఎస్ సెక్షన్ 303(2) కింద కేసులు నమోదయ్యాయి!

జిల్లా ఎస్పీ ఆదేశాలతో సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి! నవంబర్ 14న నల్లగొండ రూరల్ పోలీసులు గిగిరకలబావిగూడెం శివారులోని చింతచెట్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు కార్లు, ఒక బైక్ పై అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు! వీరు కాంచనపల్లి గ్రామంలో చోరీకి వెళ్తున్నట్లు విచారణలో అంగీకరించారు!

అదే సమయంలో త్రిపురారం పోలీసులు బాబా సాయిపేట వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక కారు, రెండు బైకులపై వచ్చిన మరో నలుగురిని పట్టుకున్నారు! వీరిలో పాత నేరస్థుడైన రమావత్ సుమన్ ను విచారించగా మిగిలిన నిందితుల వివరాలు, 38 చోరీల గుట్టు బయటపడింది!

పట్టుబడిన నిందితుల వివరాలు!

1. నకిరేకంటి స్వర్ణ కుమార్ (32): సైట్ ఇంజినీర్, యాదవ కాలనీ, దామరచర్ల మండలం!

2. భూక్యా బాలు (33): సైట్ ఇంజినీర్, హనుమాన్ నగర్, నల్లగొండ!

3. శ్రీకాంత్ రెడ్డి (35): ఎయిర్ టెల్ ఇంజినీర్, బరకత్ గూడెం, మునగాల మండలం!

4. రమావత్ సుమన్: మాజీ ఎయిర్ టెల్ ఉద్యోగి, ధీరావత్ తండా, మిర్యాలగూడ మండలం!

5. లకావత్ రాములు (52): మాజీ రిగ్గర్, హేమ్లా తండా, మేళ్లచెరువు మండలం!

6. జక్కల నితీష్ కుమార్ (24): ఎయిర్ టెల్ టవర్ల కారు డ్రైవర్, చెట్ల చెన్నారం, కనగల్ మండలం!

7. పెంటమల్ల మహేష్ (24): ఎయిర్ టెల్ రిగ్గర్, దాచారం, నేరేడుచర్ల మండలం!

8. భీమనపల్లి రవి (34): సెల్ టవర్ టెక్నీషియన్, హౌసింగ్ బోర్డు, మిర్యాలగూడ!

9. అంగోతు తిరుపతి (39): ఎయిర్ టెల్ నెట్ వర్క్ రిగ్గర్, హేమ్లా తండా, మేళ్లచెరువు మండలం!

నేర విధానం మరియు ప్రాంతాల వారీగా కేసులు!
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు ఈ నేరాలకు పాల్పడ్డారు! తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని, రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లోని టవర్ల వద్దకు వెళ్లి ఆర్ ఆర్ యూల వైర్లు కత్తిరించి చోరీ చేసేవారు! దొంగిలించిన పరికరాలను హైదరాబాద్ లో విక్రయించి, వచ్చిన సొమ్ముతో ఖరీదైన కార్లు, బైకులు కొనుగోలు చేస్తూ జల్సాలు చేసేవారని పోలీసులు తెలిపారు!

నిందితులు మొత్తం 38 చోరీలకు పాల్పడగా, ప్రాంతాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి!
మిర్యాలగూడ: 16 కేసులు!
నల్లగొండ: 9 కేసులు!
సూర్యాపేట: 8 కేసులు!
దేవరకొండ: 2 కేసులు!
ఇతర జిల్లాలు: 3 కేసులు!

స్వాధీనం చేసుకున్న సొత్తు మరియు పోలీసులకు రివార్డులు!
అరెస్టయిన 9 మంది నిందితుల నుంచి రూ 25 లక్షల విలువైన మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ 15 లక్షల నగదు మరియు 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు!

ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, త్రిపురారం ఎస్ ఐ కె నరేశ్, నల్లగొండ రూరల్ ఎస్ ఐ, సీసీఎస్ ఎస్ ఐ సురేశ్, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, ఫయాజ్, నాగరాజు, కానిస్టేబుళ్లు అస్రార్, సాయి, శివరాజు, నరేశ్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు!

#DailyBharath #NalgondaPolice #AirtelTowerTheft #RRUTheft #TelanganaCrime

Previous సిరిసిల్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! నేటి బాలలే రేపటి దేశ భావి భారత నిర్మాతలు!
Next కష్టకాలంలో తోటి సర్పంచ్ కు అండగా! రూ 1.50 లక్షల ఆర్థిక సాయంతో మానవత్వం చాటిన రెంజల్ సర్పంచుల ఫోరం!
ADVERTISEMENT