ప్రజలు నీళ్లు వేస్ట్ చేస్తే ఫైన్లు! మరి అధికారుల నిర్లక్ష్యానికి శిక్ష ఏది!
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 29వ వార్డులో భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా వెళుతున్నా పట్టించుకోని అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!
పైప్ లైన్ పగిలి రోడ్లపైకి నీరు వృధాగా పారుతున్నా, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయకపోవడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు!
ప్రజలు నీళ్లు వేస్ట్ చేస్తే ఫైన్లు వేసే మున్సిపల్ అధికారులు, ఇలా వేల లీటర్ల నీరు వృధాగా పోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు!
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు! పగిలిన పైప్ లైన్ ను వెంటనే మరమ్మతు చేసి నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు!
#DailyBharath #RajannaSircilla #MunicipalWater #Bhagiratha #WaterWaste