| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల : హాస్టళ్ల మూసివేతపై టీఆర్ఎస్వీ ఫైర్! విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు!

రాజన్న సిరిసిల్ల : హాస్టళ్ల మూసివేతపై టీఆర్ఎస్వీ ఫైర్! విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు!

హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి! కాంగ్రెస్ ప్రభుత్వంపై కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం!

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు!

శనివారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిని మరింత ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు!

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు! ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ విద్యార్థులకు హాస్టళ్లు ఎంతో కీలకమని, అలాంటి వసతి సౌకర్యాలను మూసివేయాలని చూడటం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు!

యూనివర్సిటీలోని ఈ 1, ఈ 2, డీ బ్లాక్ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు! విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు!

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తున్న విద్యార్థుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు! విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకొని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు!

హాస్టళ్లను యథావిధిగా కొనసాగించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు! విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్వీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని కంచర్ల రవి గౌడ్ స్పష్టం చేశారు!

ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ కే అప్రోచ్, ఆరేల్లి వినయ్, సదుల శేఖర్, కల్యాడపు వినయ్, వాల్సా అక్షయ్, కంభోజి హర్షిత్, అన్నడి మింటు, సందవేని వివేక్ తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #RajannaSircilla #OsmaniaUniversity #TRSVC #KancharlaRaviGoud

Previous నవతరమా! నషా చోడో! నయా ఇతిహాస్ లిఖో!
Next రాజన్న సిరిసిల్ల : వృధాగా పోతున్న మున్సిపల్ వాటర్! పట్టించుకోని అధికారులు!
ADVERTISEMENT