డైలీ భారత్, నిజామాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్ కు రూ 1.50 లక్షల ఆర్థిక సహాయం చేసి రెంజల్ మండల సర్పంచుల ఫోరం మానవత్వం చాటింది!
రెంజల్ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఈ ఆర్థిక సహాయం అందజేశారు! హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తమ తోటి సర్పంచ్, కిసాన్ తండా గ్రామ సర్పంచ్ విజయ్ ని రెంజల్ మండల సర్పంచుల ఫోరం సభ్యులు పరామర్శించారు!
వైద్య ఖర్చులు అధికంగా అవుతున్న నేపథ్యంలో రెంజల్ మండల సర్పంచుల ఫోరం తరఫున విజయ్ కుటుంబానికి రూ 1,50,000 ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది!
వారి కుటుంబానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం అవసరమైనా తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచులు హామీ ఇచ్చారు! అదేవిధంగా జిల్లా సర్పంచుల ఫోరం సభ్యులతో మాట్లాడి, వారి తరఫున కూడా మరింత ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు!
ఈ సందర్భంగా విజయ్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరం కలిసి భగవంతుడిని ప్రార్థించారు! కష్టకాలంలో తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు!
సర్పంచ్ విజయ్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు!
#DailyBharath #Nizamabad #Renjal #SarpanchForum #Humanity