| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! నేటి బాలలే రేపటి దేశ భావి భారత నిర్మాతలు!

సిరిసిల్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! నేటి బాలలే రేపటి దేశ భావి భారత నిర్మాతలు!

రెయిన్ బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

డైలీ భారత్, గాంధీనగర్ సిరిసిల్ల: భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రెయిన్ బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి!

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన MEO ఆలయ మహేష్ మరియు పాఠశాల కరస్పాండెంట్ నాగుల శ్రీనివాస్ గౌడ్ ముందుగా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు!

అనంతరం ఆయన మాట్లాడుతూ "నేటి బాలలే రేపటి దేశ భావి భారత నిర్మాతలు" అని నెహ్రూ అన్న మాటలను గుర్తు చేశారు! విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, సాంస్కృతిక రంగాలలో కూడా రాణిస్తుండటం చూసి అభినందించారు!

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా నిర్వహించిన ఉత్తమ విద్యార్థులుగా మారుస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు! బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల భవిష్యత్తును దేశానికి మార్గదర్శకం చేసే బాలలే రేపటి ఉత్తమ పౌరులు అని తెలిపారు!

ఈ రోజున బాలల దినోత్సవం పర్వదినం అని తెలిపారు! ఈ కార్యక్రమంలో పాఠశాల HOD శ్రీ లత, హైస్కూల్ HM అమూల్య మరియు ప్రైమరీ స్కూల్ HM శివరాం పాల్గొని ప్రసంగించారు! ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు!

#DailyBharath #RajannaSircilla #ChildrensDay #RainbowSchool #Gandhinagar

Previous పాలక్కాడ్ కు చేరుకున్న అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం శబరిమల మహా పాదయాత్ర బృందం!
Next పనిచేస్తున్న సంస్థకే కన్నం! రూ 1.62 కోట్ల టవర్ పరికరాలు చోరీ! 9 మంది అరెస్ట్!
ADVERTISEMENT