డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది! ఐదు దశాబ్దాలకు పైగా తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు!
గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు!
బాల్యం, కుటుంబ నేపథ్యం!
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు! ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు! చిన్నతనం నుంచే నాటకాలపై ఉన్న మక్కువతో ఆయన సినీ రంగం వైపు అడుగులు వేశారు!
గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లో అనారోగ్యంతో మరణించారు! ఆయనకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు! తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రఘుబాబు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హాస్యనటుడిగా కొనసాగుతున్నారు!
ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం!
1973లో విడుదలైన "జగమే మాయ" సినిమాతో గిరిబాబు వెండితెరకు పరిచయమయ్యారు! మొదట్లో హీరోగా రాణించాలని వచ్చినప్పటికీ, ప్రతినాయక పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు! ఆ తర్వాత హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించారు!
ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర నటులతో కలిసి పనిచేశారు! పాత తరం సినిమాలతో పాటు "అతడు", "గమ్యం", "డమరుకం", "గీత గోవిందం", "జాతి రత్నాలు" వంటి నేటి తరం చిత్రాల్లో తండ్రి, తాతయ్య పాత్రల్లోనూ మెప్పించారు! 2023లో విడుదలైన "అన్నీ మంచి శకునములే" ఆయన నటించిన చివరి చిత్రం!
దర్శకుడిగా, నిర్మాతగా ప్రతిభ!
కేవలం నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గిరిబాబు చిత్ర పరిశ్రమకు సేవలందించారు! "దేవతలారా దీవించండి", "సింహ గర్జన", "మెరుపు దాడి", "ఇంద్రజిత్" వంటి చిత్రాలను నిర్మించడంతో పాటు "మెరుపు దాడి" సినిమాకు కథను కూడా అందించారు! అలాగే "రణరంగం", "ఇంద్రజిత్", "నీ సుఖమే నే కోరుకున్నా" చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగానూ విజయం సాధించారు!
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం!
గిరిబాబు మరణవార్త తెలిసిన వెంటనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది! సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు! ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు!
#DailyBharath #Giribabu #Tollywood #RIPGiribabu #TeluguCinema