డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కల స్వైర విహారం తారాస్థాయికి చేరుకుంది. ప్రతి డివిజన్లో పదుల సంఖ్యలో వీధి కుక్కలు ఇష్టానుసారంగా స్వైర విహారం చేస్తున్నప్పటికీ, ప్రజలపై డాడీకి పాల్పడి గాయపరుస్తున్నప్పటికీ కూడా వాటిని నివారించడంలో సంబంధిత మున్సిపల్ అధికారులు అవుతున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా రోటరీ నగర్ లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మంగళవారం కాలనీలో స్వైర విహారం చేస్తున్న కుక్కలు ఆరుగురిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా ఓవైపు స్వైర విహారం చేస్తుండగా మరోవైపు వానరాల స్వైర విహారం పలు కాలనీలలో ఇళ్లల్లోకి చొరబడి ముఖ్యంగా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీది కుక్కలు, వానరాలను అదుపులోకి తీసుకొని అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు
News
జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఆరుగురు పై దాడి