| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నషా ముక్త్ భారత్ ర్యాలీలో కీర్తిరెడ్డికి కీలక బాధ్యతలు! 3 రోజులు భారీ ర్యాలీ!

నషా ముక్త్ భారత్ ర్యాలీలో కీర్తిరెడ్డికి కీలక బాధ్యతలు! 3 రోజులు భారీ ర్యాలీ!

డైలీ భారత్, హైదరాబాద్: యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల ర్యాలీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ర్యాలీ...

- 24వ తేదీ: అంబర్‌పేట్ నుంచి ముషీరాబాద్ వరకు

-25వ తేదీ: ముషీరాబాద్ నుంచి ఖైరతాబాద్ వరకు

-26వ తేదీ: ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్ వరకు

మూడు రోజుల పాటు కొనసాగనుంది.

కీర్తిరెడ్డికి కీలక బాధ్యతలు

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. మరో నలుగురు సభ్యులతో కలిపి ఆమెకు నాన్ తెలుగు కమ్యూనిటీ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు అప్పగించారు.

అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న వివిధ నాన్ తెలుగు కమ్యూనిటీల ప్రజలను ఈ ర్యాలీలో భాగస్వాములను చేయడం, వారిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించడం, ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా వ్యవహరించనుంది.

నషా ముక్త్ భారత్ ర్యాలీ కోఆర్డినేషన్ కమిటీలో తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల కీర్తిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకురాలు బంగారు శృతి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కీర్తిరెడ్డి కామెంట్స్:
"డ్రగ్స్ మహమ్మారి నేడు దేశ భవిష్యత్తైన యువతను పట్టిపీడిస్తోంది.

మత్తు పదార్థాల కారణంగా యువత భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా దేశ ప్రతిష్ఠకు కూడా భంగం కలుగుతోంది.

డ్రగ్స్ భూతాన్ని సమాజం నుంచి కూకటివేళ్లతో పెకలించి వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యం కాదు.
అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ కమ్యూనిటీల ప్రతినిధులు సమిష్టిగా ముందుకు రావాలి.

ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త్ భారత్ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీని విజయవంతం చేద్దాం."

భారీగా తరలిరండి

హైదరాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ రహిత భారత నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కీర్తిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

#DailyBharath #NashaMuktBharat #KeerthiReddy #KishanReddy #BJP #Hyderabad #Secunderabad #SayNoToDrugs

Previous నల్గొండలో దారుణం! పోలీస్ క్వార్టర్స్‌లోనే మహిళా హోంగార్డును గొంతు నులిమి చంపిన భర్త!?
Next జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఆరుగురు పై దాడి
ADVERTISEMENT