| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 370 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.3.70 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అందజేశారు.

మండలాల వారీగా నిజామాబాద్ రూరల్‌లో 65, మోపాల్‌లో 37, డిచ్‌పల్లిలో 128, జక్రాన్‌పల్లిలో 33, ధర్పల్లిలో 61, సిరికొండలో 46 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Previous అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే
Next కస్తూర్బా బాలికల విద్యాలయంను తనిఖీ చేసిన కలెక్టర్... సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ మండిపాటు
ADVERTISEMENT