| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:  నిజామాబాద్  నగరానికి స్టేడియం తీసుకురావడమే తన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. స్టేడియం నిర్మాణం కోసం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం నిర్మించాలన్నదే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. స్టేడియం నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

గత పదేళ్లుగా నిర్విరామంగా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడంతో పాటు పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం యువతకు శిక్షణ అందిస్తున్న ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ సేవలను అభినందించారు.

ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో శిక్షణ పొందాలని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. నికత్ జరీన్, హుస్సాముద్దీన్, పూర్ణ మాలావత్, ఎండల సౌందర్య వంటి క్రీడాకారులు ఇందూరుకు గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఖైసర్ అకాడమీ ఫౌండర్ ఖైసర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కరాటే రమేష్, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Previous జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఆరుగురు పై దాడి
Next ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం
ADVERTISEMENT