డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ప్రజలు డబ్బులు పోగొట్టుకోవద్దని సీపీ పి. సాయి చైతన్య సూచించారు. ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపు మేరకు నవంబర్‌ను సైబర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ జాగ్రూకత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల దుర్వినియోగం, నకిలీ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.