| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్‌లో దారుణం... పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తులతో వీరంగం! జిల్లా వ్యాప్తంగా కలకలం!

నిజామాబాద్‌లో దారుణం... పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తులతో వీరంగం!  జిల్లా వ్యాప్తంగా కలకలం!

డైలీ భారత్, నిజామాబాద్: మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై కత్తులతో దాడి జరగడంతో జిల్లా వ్యాప్తంగా పండగ వేళ కలకలం రేపింది.

నగర శివారులోని మాణిక్ బండర్ గ్రామానికి చెందిన వినయ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వినయ్‌కు సంబంధించిన భూమిని తక్కువ రేటుకు ఇవ్వాలని పొరుగు వారు కోరుతున్నట్టు తెలిసింది. మార్కెట్ రేటు కాకుండా తక్కువ ధరకు ఇవ్వాలని ఓ యువకుడు శుక్రవారం ఉదయం వినయ్‌తో ఇంటి వద్ద గొడవకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

ఆ ఘర్షణ నేపథ్యంలో వినయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. పోలీస్ స్టేషన్‌లో కారు దిగిన వినయ్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అతనికి నాలుగు చోట్ల కత్తిపోట్లు తగిలాయి.

ప్రాణ భయంతో వినయ్ అరుపులు విన్న పోలీసులు వెంటనే బయటకు వచ్చి వారి నుంచి అతడిని రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

వినయ్‌పై కత్తులతో దాడి జరిగిన విషయం తెలిసిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి దాడి చేసిన వ్యక్తులను అప్పగించాలని డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకునేందుకు నార్త్ రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాస్ స్పందించి, ప్లాట్ వివాదంలో గొడవలు జరిగి కత్తిపోట్లు జరిగాయని తెలిపారు.

#డైలీభారత్ #Nizamabad #Makloor #DasNagar #DailyBharath

Previous అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ... బోస్టన్‌లో గాలింపు చర్యలు తీవ్రం
Next మైనర్ పై వేధింపులు... నిందితుడికి 20 ఏళ్ల జైలు! సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు!
ADVERTISEMENT