డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో భేటీ అయ్యారు. ఆయా శాఖల వారిగా కొనసాగుతున్న పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఆర్అండ్ బీ, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర ఉన్నతాధికారులతో ఆయా పనుల పురోగతి తెలుసుకున్నారు. అంగన్వాడీ లో శాశ్వత భవనాలు, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రోడ్డు పనులు, కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల కు స్థలసేకరణ తదితర అంశాలపై చర్చించారు.
News
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ తో భేటీ అయిన అర్బన్ ఎమ్మెల్యే