| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వర్షం వెలిసి 48 గంటలు! ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే కుటుంబం... అధికారులు ఉన్నారా లేరా!?

వర్షం వెలిసి 48 గంటలు! ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే కుటుంబం... అధికారులు ఉన్నారా లేరా!?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో సకాలి బజారులో ఉన్న ఆకుల శ్రీను కుటుంబం గత మూడు రోజుల నుంచి మోకాళ్ళు లోతు నీళ్లలో ఉంటున్నారు. వర్షం వెలిసి 48 గంటలు కావస్తున్నా ఇప్పటికి ఏ అధికారి పట్టించుకోలేదు.

అధికారులు ఉన్నారా... లేరా...?

ఇప్పటికైనా స్థానిక MRO గారు పట్టించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. లేని యెడల రేపు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు, తంబళ్ల రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.

#డైలీభారత్ #Bhadradri #Dummugudem #Flood #DailyBharath

Previous అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ పాదయాత్ర 15వ రోజు పూర్తి...!!
Next లలిత్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి! రూ.4 లక్షల అక్రమ బాణాసంచా స్వాధీనం... ఇద్దరు అరెస్ట్!
ADVERTISEMENT