డైలీ భారత్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పెరమ్ స్వామి (HG No. 530) చిన్న కుమార్తె పెరమ్ అక్షిత 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం (Bronze Medal) సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షిత సాధించిన ఈ విజయం పట్ల కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.