డైలీ భారత్, అనంతపురం: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.
ఈరోజు ఉదయం దాదలూరు నుండి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు సాయంత్రానికి గోట్లూరు చేరుకుంది. రాత్రికి అక్కడ బస చేసి రేపు ఉదయం గోట్లూరు నుండి శబరిమల మహా పాదయాత్ర రేపు సాయంత్రానికి పాలసముద్రానికి చేరుకుంటుందని సంజయ్ గురుస్వామి తెలిపారు.
మార్గమధ్యంలో భక్తులు సంజయ్ గురుస్వామికి ఘన స్వాగతం పలుకుతూ, అన్నదానం, పాద సేవ చేస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో పాదయాత్ర సాగుతోంది.
#డైలీభారత్ #Ayyappa #Sabarimala #Padayatra #SanjayGuruswamy #DailyBharath