డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:దీపావళి పండుగకు శ్రీకారం చుట్టే పవిత్రమైన పర్వదినం ధన త్రయోదశి. ఈ పండుగను ధన్‌తేరస్ అని కూడా పిలుస్తారు.
ఈ రోజున లక్ష్మీదేవితో పాటు సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని, ఆరోగ్య ప్రదాతగా భావించే ధన్వంతరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మంచిదని అందుకే ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావిస్తుంటారని హిందూ సాంప్రదాయ ఆచారం ప్రకారం కొనసాగుతూ వస్తుంది.
ధన త్రయోదశి సందర్భంగా బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇళ్లను శుభ్రం చేసి దీపాలతో అలంకరించి, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. సంపదతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటారు.
ఈ ధన త్రయోదశి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు నింపాలని ప్రజలు మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని కోరుకుంటారు. అందుకే దీపావళి పండగ సమయంలో ధన్ త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది.