| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దారుణం! భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త! అనుమానంతో భార్యను సజీవ దహనం

దారుణం! భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త! అనుమానంతో భార్యను సజీవ దహనం

డైలీ భారత్, కన్నౌజ్, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్ లో మనసును కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నౌజ్ జిల్లా జగత్‌పూర్ గ్రామంలో భర్త తన భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య చేశాడు. మృతురాలిని సోనమ్ (30) గా గుర్తించారు. నిందితుడు భర్త సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోనును పోలీసులు అరెస్ట్ చేశారు.

11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం:

సోనమ్, సుఖ్‌బీర్ 11 ఏళ్ల క్రితం హర్యానా హిసార్ లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ పరిచయం అయ్యి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 7 ఏళ్ల కుమారుడు, 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

గత 4 ఏళ్లుగా సుఖ్‌బీర్ భార్య పై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని అనుమానించేవాడు. దీపావళి పండుగ కోసం కుటుంబం జగత్‌పూర్ గ్రామానికి వచ్చింది. సోనమ్ స్థానిక యువకుడితో మాట్లాడుతుండటం చూసి గొడవ పెద్దదైంది. విషయం సికందర్‌పూర్ పోలీస్ అవుట్‌పోస్ట్ వరకు వెళ్లింది. గ్రామ పంచాయతీ పెద్దలు ఇద్దరినీ కలిపి రాజీ కుదిర్చినా శాంతి ఎక్కువ సేపు నిలవలేదు.

గురువారం ఉదయం దారుణం:

గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత సుఖ్‌బీర్ బయటకు వెళ్లి అరగంట తర్వాత పెట్రోల్ బాటిల్ తో తిరిగి వచ్చాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చేలోపే మంటలు తీవ్రంగా వ్యాపించాయి.

నిందితుడు అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు.

పోలీసుల చర్య:

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గంటన్నర పాటు శ్రమించి మంటలను ఆర్పారు. లోపల సోనమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కన్నౌజ్ ఎస్పీ వినోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఛిబ్రమౌ కోత్వాలి ఇన్‌చార్జ్ కపిల్ దూబే తెలిపిన ప్రకారం, భార్య పై అనుమానమే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు వేటాడి నిందితుడు సుఖ్‌బీర్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరు పిల్లలను సురక్షితంగా గుర్తించి బంధువులకు అప్పగించారు. సోనమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

#డైలీభారత్ #UttarPradesh #Kannauj #DailyBharath

Previous వరదలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు ప్రాణదానం... ప్రాణాలకు తెగించి రక్షించిన సీఐ సుబ్బనాయుడు
Next ఘోర హత్యాకాండ.. భార్యతో సహా ఏడుగురి హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌!? రోకలి బండతో దారుణం!
ADVERTISEMENT