| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర హత్యాకాండ.. భార్యతో సహా ఏడుగురి హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌!? రోకలి బండతో దారుణం!

ఘోర హత్యాకాండ.. భార్యతో సహా ఏడుగురి హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌!? రోకలి బండతో దారుణం!

డైలీ భారత్, బెంగళూరు:కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్యాకాండ వెలుగులోకి వచ్చింది. భార్యతో ఏర్పడిన కుటుంబ విభేదాల నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇందుశేఖర్ అలియాస్ శేఖర్ తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

కుటుంబ విభేదాలే కారణమా?

సుమారు 20 ఏళ్ల క్రితం సునీతను వివాహం చేసుకున్న శేఖర్‌కు ఆమె పుట్టింటి వారితో సంబంధాలు కొనసాగించడం నచ్చకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ క్రమంలో తొలుత భార్య సునీతను హత్య చేసి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ హత్యల్లో రోకలి బండను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుల్లో మహిళలు, చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. హత్యల అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలుస్తోంది.

నిందితుడు అరెస్ట్:

ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ల బాలుడు పునీత్ మృతదేహాన్ని నందిహిల్స్ సమీపంలో గుర్తించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. మిగిలిన మృతదేహాలకు సంబంధించి పోలీసులు గాలింపు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చిన్నపాటి కుటుంబ విభేదాలు ఇంతటి ఘోరానికి దారితీశాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు, హత్యల వెనుక అసలు కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

#డైలీభారత్ #Bengaluru #Karnataka #DailyBharath

Previous దారుణం! భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త! అనుమానంతో భార్యను సజీవ దహనం
Next ఢిల్లీలో భారీ కల్తీ మాఫియా గుట్టురట్టు! దీపావళి వేళ 7,000 కిలోల నకిలీ పన్నీర్ సీజ్ - రంగంలోకి సీఎం రేఖా గుప్తా!
ADVERTISEMENT