| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెజి టేబుల్స్ మార్కెట్ డే కార్యక్రమం నిర్వహించిన : ఏకశిలా ఏంజిల్స్ పాఠశాల

వెజి టేబుల్స్ మార్కెట్ డే కార్యక్రమం నిర్వహించిన : ఏకశిలా ఏంజిల్స్ పాఠశాల

డైలీ భారత్, మహబూబాబాద్:ఏకశిలా ఏంజిల్స్ పాఠశాలలో కూరగాయల మార్కెట్ పద్ధతిలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు కూరగాయలపై అవగాహన సదస్సును నిర్వహించారు . వివిధ రకాల కూరగాయలతో ఎంతగానో అలరించారు . కూరగాయలతో రైతు , గిన్నెలు , నాగలి వినాయకుడు వంటి దేవతామూర్తులను చిత్రించారు . వివిధ రకాల పనిముట్లు తయారుచేసి అలరించడం జరిగింది . కురగాయాల మీద రైమ్స్ , పాటలు నృత్యాలు చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా కూరగాయలు పండించే రైతుల గొప్పతనాన్ని చాటిచెప్పారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ కే .రమేష్ రెడ్డి  గారు మాట్లాడుతూ కూరగాయలు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు మయూరి , ఐస్లీన్‌,   మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .

Previous తండ్రికి భారత రత్న రావడంపై స్పందించిన అద్వానీ కూతురు
Next బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని భారీ ర్యాలీ
ADVERTISEMENT