| Daily భారత్
Logo




జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం

News

Posted on 2026-07-19 04:48:37

Share: Share


జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు  పరిధిలో  గోపీకృష్ణ నర్సరీ ఎదుట, కొత్తగూడెం–ఖమ్మం బి.టి. రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో OD 10 H 4342 నంబరు గల మహీంద్రా జైలో (Mahindra XYLO) వాహనాన్ని పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్ (46), త్రినాథ్ బిసోయి మరియు గణేష్ ముదులి (21) అనే ముగ్గురు వ్యక్తుల వద్ద 100 గ్రాముల చొప్పున మూడు (03) ప్యాకెట్ల డ్రై గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,000 అంచనా నిందితుల వద్ద నుండి డ్రై గంజాయిని పంచసాక్షుల సమక్షంలో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని సీజ్ పంచనామా నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS Act) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూలూరుపాడు పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలునిర్వహిస్తున్నారని, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >