Posted on 2026-07-18 15:41:39
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ సిబ్బంది నగరంలోని హోటళ్లు, మెస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్‌లో అనుమతి లేకుండా మద్యం తాగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మెస్ నిర్వాహకుడు లింబయోల దిలీప్ రెడ్డిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ, హోటళ్లు, మెస్‌లు, దాబాల్లో అనుమతి లేకుండా మద్యం అమ్మడం లేదా తాగనివ్వడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.
ఈ దాడిలో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్సై విక్రంకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుళ్లు రాజు, దినేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >