| Daily భారత్
Logo




రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

News

Posted on 2026-07-18 15:35:33

Share: Share


రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ  రోహిత్ రాజు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, చెక్ పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రధాన రహదారులు, పుష్కర ప్రాంతాలకు వచ్చే మార్గాల్లో అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలని తెలిపారు.

ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని, రిస్క్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. పుష్కరాల సమయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >