డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
టేకులపల్లి మండలం నుండి సుజాతనగర్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును (నెంబర్: TG29T1053) సుజాతనగర్ పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, పశువులను అత్యంత క్రూరంగా కట్టేసి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
రెండు ఆవు దూడలు, రెండు కోడి దూడలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును సీజ్ చేశారు.
బత్తుల శ్రీను, మాదాసు శ్రీను ,నిందితులు టేకులపల్లి ప్రాంతంలో మధ్యవర్తి సేవ్య సహాయంతో పశువులను తక్కువ ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, కోదాడ సంతలో ఎక్కువ ధరకు విక్రయించడానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.