| Daily భారత్
Logo




500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

News

Posted on 2026-06-05 17:12:30

Share: Share


500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా సెంటర్లలో అక్రమాలతోపాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కస్టమర్లకు సంబంధించిన డేటా రిజిస్టర్‌ను సైతం స్పా సెంటర్ నిర్వాహకులు మెయింటెయిన్ చేయడం లేదని గుర్తించారు. అలాగే స్పా సెంటర్లకు రెంటుకు ఇస్తున్న ఓనర్లను కూడా ఈ సందర్భంగా పోలీసులు విచారించారు.

స్పా సెంటర్ల నుంచి రెంట్ తీసుకోవడం తప్ప.. అందులో ఏం జరుగుతుందో కూడా ఓనర్లు పట్టించుకోవడం లేదని పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కొన్ని స్పా సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి కూడా.. ఇంటి ఓనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని స్పా సెంటర్ల భారీగా ఉన్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అడపాదడపా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఆయా ఫిర్యాదుల మేరకు పోలీసులు దాడులు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ నగరంలో ఒకే సారి భారీగా స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేయడం ఇదే ప్రధమం అనే చర్చ నడుస్తుంది. అలాగే స్పా సెంటర్ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. పోలీస్ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. స్పా ముసుగులో అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా.. వీటికి అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >
Image 1

ఈ నెల 25 నుండి కోటప్పకొండలో తొలి ఏకాదశి మహోత్సవాలు

Posted On 2026-07-24 09:07:06

Readmore >