Posted on 2026-06-05 17:09:30
డైలీ భారత్, కాకినాడ: కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివరామ్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.
ఉదయం నుంచి సోదాలు చేపట్టిన అధికారులు, ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులను గుర్తించారు.
ఆయన భార్య పేరుపై కాకినాడలో సుమారు రూ.1,77,62,600 విలువైన ప్లాట్‌తో కూడిన అపార్ట్‌మెంట్, తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్‌లో రూ.1,34,23,000 విలువైన ప్లాట్, తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో 1 ఎకరం 82 సెంట్ల వ్యవసాయ భూమి, అలాగే టయోటా ఫార్చ్యూనర్ కారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శివరామ్ కుమార్ పేరుపై కాకినాడ రామారావుపేటలో రూ.1.20 కోట్ల విలువైన 375 గజాల ఖాళీ స్థలం, అలాగే మహీంద్రా కంపెనీకి చెందిన రెండు కార్లు ఉన్నట్లు వెల్లడైంది.
అదనంగా, సోదాల్లో సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.27,12,800 విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >