| Daily భారత్
Logo




మద్యపాన వ్యసనం నుండి కార్మికులు విముక్తి పొందాలి : ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2026-06-05 13:53:03

Share: Share


మద్యపాన వ్యసనం నుండి కార్మికులు విముక్తి పొందాలి : ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నగర్ లోని కార్మికులకు మద్యపాన వ్యసన నిర్మూలనపై ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ కౌన్సెలింగ్ నిర్వహించి కార్మికులకు మద్యపాన వ్యసనం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యపానం తాత్కాలిక ఆనందాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

మద్యపాన వ్యసనం కారణంగా ఆరోగ్య సమస్యలు, కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనతలు, మానసిక ఆందోళనలు, కుటుంబ కలహాలు మరియు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా కార్మికులు మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సంక్షేమానికి కూడా తోడ్పడగలరని చెప్పారు.

మద్యపాన వ్యసనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అని తెలుపుతూ, దీనికి సరైన చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిగా విముక్తి పొందవచ్చని వివరించారు.

మద్యపానం మానేందుకు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మద్యపానం మాన లేము, చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు వంటి అపోహలను విడిచిపెట్టి, వ్యసనం నుండి బయటపడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మద్యపాన వ్యసన విముక్తి పొందాలని అనుకునేవారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత  కార్మికులు పాల్గొన్నారు.

Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >