| Daily భారత్
Logo




పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు : మంజుల పత్తిపాటి

News

Posted on 2026-06-05 05:07:58

Share: Share


పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు : మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు....

ఒకప్పుడు

పక్షుల కిలకిలారావాలతో మేల్కొన్న ఉదయం..!

ఈ రోజు మొబైల్ ఫోన్ల అరుపులతో తడబడుతోంది.

ఉదయం..!

మనిషి అభివృద్ధి పేరుతో

అడవులు నరికేస్తే...

రేపటి పిల్లల చేతుల్లో

పుస్తకాలు కాదు 

ఆక్సిజన్  బాటిళ్లను

మోయవలసి  వస్తుంది..!

ఒకప్పుడు

చెట్టు నీడలో కూర్చుని

తల్లి జోలపాట పాడేది… కాని ఇప్పుడు

నరికిన చెట్ల రక్తం తో 

మనిషి వేసిన కాంక్రీట్ గోడల మధ్య

ఊపిరాడక బంధీలైపోవలిసి వస్తుంది..!

ప్రకృతిని జయించాను అని అనుకొన్న మనిషి

చివరికి...

ఒక నీటి బొట్టుకోసం

ఆకాశం వైపు చేతులు చాచే రోజులు

ఎంతో దూరంలో లేవు..!

మనిషి చేతుల్లో ఇప్పుడు

మొబైల్ ఫోన్లు ఉన్నాయి

మట్టివాసనను తాకే వేళ్లు లేవు..!

ఎయిర్‌కండిషన్ గదుల్లో

 ఊపిరాడక చనిపోతోన్న సమయాన..

డబ్బు కట్టలు పట్టుకుని

మనిషి ఒక ఆక్సిజన్ చుక్క కోసం

ప్రకృతి దేవుడిని వేడుకుంటాడు

కానీ... నాకూ యోగ్యత 

లేదు అని తెలుసుకోలేకపోయాడు..!

కాంక్రీట్ అడవుల్లో మునిగిపోయిన

మనిషి చెవులకు చెట్ల నుంచి వచ్చిన 

మధుర రాగాలు వినే యోగ్యత 

లేదు అని తెలుసుకోలేకపోయాడు..!

ఆకుపచ్చ భూమి ఆర్తనాదం..

ఎండిపోయిన నదుల గుండె చప్పుడు..

విని పలికిన ప్రతి మాటలో

మట్టివాసన గొప్పతన్నాన్ని 

మనిషి చెవుల్లో నాటుతుంది

మంజుల పత్తిపాటి..!

నరికిన చెట్ల నీడల్లో..

చెదిరిన పక్షుల గూటిల్లో..

ప్రకృతి బాధను

కన్నీటి చుక్కగా కాదు,

అగ్నిజ్వాలగా రాసే స్వరం

మంజుల పత్తిపాటి..!

ఒక మొక్క నాటడానికి..

ఒక నదిని కాపాడడానికి..

ఒక పక్షి గూటిని నిలబెట్టడానికి..

మన శ్వాసను నిలుపుకోవడానికి..

ఇంకా సమయం ఉంది…!

జూన్ ఐదో తేదీ చెబుతోంది

ప్రకృతిని రక్షించు అంటోంది

మనమందరం కలిసొస్తే

పచ్చని ప్రపంచం నవ్వుతోంది..!

ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం  పచ్చని భూమి మన అందరి బాధ్యత.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(  జూన్ ఐదు ) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో....

ప్రకృతి ముద్దుబిడ్డ‐-‐మంజుల పత్తిపాటి.


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218.

Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >