| Daily భారత్
Logo




ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు

News

Posted on 2026-06-04 12:22:23

Share: Share


ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా :  మద్దిశెట్టి సామేలు

మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి NYC కోర్ కమిటీ మరియు రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని గంగాపుత్ర ఫంక్షన్ హాల్ నందు మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి NYC కోర్ కమిటీ మరియు రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ మద్దిశెట్టి సామేలుహాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామపంచాయతీలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.

పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలను తమ ప్రధాన అజెండాగా తీసుకోవాలని, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య వారధిలా పనిచేయాలని అన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులను కలుస్తూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.

రాజకీయ పదవులు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా శివశక్తి పూజారి అంశంపై కూడా మద్దిశెట్టి సామేలు స్పందించారు. ఈ విషయమై గతంలో భారత రాష్ట్రపతి కార్యాలయానికి, జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఆ వినతులపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం మరియు జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధిత ఎండోమెంట్స్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.

పార్టీ జాతీయ నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో పార్టీ నిర్మాణం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన రాజులపాటి ఐలయ్య, కొనక రామదాసు, బీరు సామేలు, పూనె వెంకన్న, దానసరి సారమ్మ, పూనె సూరయ్య తదితర నాయకులను మద్దిశెట్టి సామేలు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలగాని శ్రీనివాస్ గౌడ్, ఇల్లందు నాయకులు కిన్నెర రామకృష్ణ మరియు మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, యువజన నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని మరింత విస్తరించి ప్రజల మధ్య బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి సామేలు తెలిపారు.

Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >