| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా : యువతి అదృశ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా : యువతి అదృశ్యం

మామిడిపల్లిలో యువతి అదృశ్యం

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్ఐ తిరుమల బాబు

యువతి ఆచూకీ తెలిస్తే కోనరావుపేట పోలీసులకు సమాచారం అందించాలి

డైలీ భారత్, కోనరావుపేట: కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పల్లి పావని (25) అనే యువతి అదృశ్యమైనట్లు ఏఎస్సై తిరుమలబాబు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. పావని సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సిరిసిల్ల వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రాత్రయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి నరసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తిరుమల బాబు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు కోనరావుపేట పోలీసులకు  సమాచారం అందించాలని కోరారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
Next వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT