| Daily భారత్
Logo




మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

News

Posted on 2026-06-03 17:41:18

Share: Share


మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

• సస్పెక్టుల ప్రతి కదలికపై నిఘా ఉంచాలి

• బాధితులతో గౌరవంగా వ్యవహరించి తక్షణ పరిష్కారం చూపాలి

• ముందస్తు సమాచారం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

• డయల్-100 కాల్స్‌కు వెంటనే స్పందించాలి

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్షించారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించిన ఎస్పీ, బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సస్పెక్టుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, నేరాల నియంత్రణ కోసం గస్తీ, పేట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని వ్యక్తులు, సంఘటనలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ముందస్తు సమాచారం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాచారం ఆధారంగా నేరాలను ముందుగానే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ ఒకే విధమైన ఆలోచనా విధానం, సమన్వయం మరియు బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ గారు సూచించారు. ప్రతి విషయాన్ని మొదటిసారే క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగా సమయం వృథా కావడంతో పాటు పనితీరు ప్రభావితమవుతుందని, అందువల్ల అప్పగించిన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

డయల్-100 కాల్స్ అందిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డి–సిరిసిల్ల రాష్ట్ర రహదారి ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి నివారణ చర్యలు అమలు చేయాలని సూచించారు. సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.

విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందుతూ నేరాల నివారణలో చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించారు.

అదేవిధంగా సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా యువతకు సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ  సూచించారు.

Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >