| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 49 వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వార్డుల వారిగా సమస్యల జాబితా రూపొందించి బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో అన్ని వార్డులలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని ముఖ్యంగా శానిటైజేషన్ సమస్య అన్ని వార్డులలో ఉందని, చాలా వార్డుల్లో నూతనంగా CC రోడ్డులు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వరద నీరు ఇబ్బంది లేకుండా చూడాలని,  ఇంతే కాకుండా వార్డుల వారిగా సమస్యలు అన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళమని అన్నారు. వాటిని సాధ్యమైనంత తొందర పరిష్కరించి గత వర్షాకాలం ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్ద డ్రైనేజీలను ముందు చూపుతో మట్టి తీయిస్తే వరద నీరు రోడ్ల పైకి రాకుండా ఉంటుందని తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాటికి బీజేపీ కౌన్సిలర్లము పూర్తి సహకారం అధిస్తామని అన్నారు.

Previous భయాలు (Phobias)... చిన్ననాటి భయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా?
Next జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
ADVERTISEMENT