Posted on 2026-05-24 04:15:55
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గోవుల అక్రమ రవాణా యదేచ్చగా జరుగుతుందనీ, దేశంలో గోవధ నిషేధ చట్టాలు ఉన్నా అవి అమలు చేయడం లో ప్రభుత్వం విఫమయ్యిందనీ, కనుక 1977 వ సంవత్సరం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొహిబీషన్ ఆప్ కౌ స్లాటర్ అండ్ ఆనిమల్ ప్రిజర్వేషన్ Act 1977 ను అమలులోకి తెచ్చినా, రాజ్యాంగం లోని ఆర్టికల్ 48 కూడా గోరక్షణకు సంబంధించినదే అయినా కానీ భద్రాద్రి జిల్లా నుండి గో సంతతి అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతూనే ఉందనీ, ఇంకా బక్రీదు పండుగ సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గోవుల అక్రమ రవాణా, అక్రమ గో వధ రెట్టింపు స్ధాయి లో జరుగుతుందనీ, కావునా హిందువులు పరమ పవిత్రంగా పూజించే, సకల దేవతా నిలయంగా భావించే, పర్యావరణ సమతుల్యానికి దోహద పడే గోసంతతి ని అక్రమ రవాణా చేయకుండా, అక్రమంగా వధించకుండా రక్షించే విధంగా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయవలసిందిగా, అక్రమంగా నిర్వహిస్తున్న కభేళాలను మూసివేయవలసిందిగా విశ్వహిందూ పరిషత్ కోరుతూ పాల్వంచ DSP గారికి, CI గారికి, పాల్వంచ పట్టణ SI గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత, పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్, పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు, ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న గారు, ప్రఖండ సహ కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్ గారు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >