| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కార్మిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ పర్సన్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గర్భిణులను సకాలంలో గుర్తించి వారికి క్రమ తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారిలో రక్తహీనత లోపించకుండా ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని ఆశా నోడల్ పర్సన్లకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, సీహెచ్‌ఓ శాంత, డీడీఎం కార్తీక్, డెమో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...
Next నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు
ADVERTISEMENT