Posted on 2026-05-12 15:31:13
యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు
మీ "లైకుల" సరదా.. పోలీసుల "సమయం" వృథా: ఆత్మహత్య డ్రామా వీడియోలు తీసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలతో ఆడుకోకండి!
సోషల్ మీడియా మోజు వద్దు – కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి
జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి:సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ మరియు లైక్స్ కోసం “ఆత్మహత్య చేసుకుంటున్నాను” అన్నట్లుగా వీడియో రూపొందించి పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలలోకి వెళ్తే,..
రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేయడంతో, విషయం గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ మరియు లైక్స్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ వీడియో రూపొందించినట్లు రోహిత్ తెలుపడం జరిగింది.
ఈ ఘటన కారణంగా పోలీసులు అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే స్పందించాల్సి రావడం వల్ల విలువైన పోలీసు సమయం మరియు వనరులు వృథా అయినట్లు కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ,
సోషల్ మీడియాలో కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ "ఆత్మహత్య డ్రామాలు" చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. మీ ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి.. పోలీసుల విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికో లేదా ఆపదలో ఉన్న బాధితులకు సాయం చేయడానికో ఉపయోగపడాలి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల పోలీసుల సమయం వృథా అయితే, నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సాయం అందడంలో ఆలస్యం జరగొచ్చు.
యువత రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కష్టపడి చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా ముందుకు సాగాలని, క్షణికమైన గుర్తింపు కోసం తప్పుదారులు పట్టవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >