| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ సినీ గేయ రచయిత, జ్యోతిష్య–వాస్తు పండితులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు  కుటుంబ వారసులు అయిన టంగుటూరి వెంకట రాందాసు ను కామారెడ్డి జిల్లాకు చెందిన కోడిప్యాక సాయిరాం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శ్రీ రాందాసు సాయిరాంను ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు. ఇద్దరూ పలు సాహిత్య, సాంస్కృతిక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ రాందాసు తన ఆశీస్సులను అందజేశారు.

ఈ భేటీపై స్పందించిన కోడిప్యాక సాయిరాం మాట్లాడుతూ, “తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ప్రకాశం పంతులు  వారసులను కలవడం నా అదృష్టం. శ్రీ రాందాసు చూపిన ఆదరణ, ఆత్మీయత జీవితాంతం గుర్తుండిపోతుంది. వారి సరళత, సంస్కారం నేటి తరానికి ఆదర్శం” అని తెలిపారు.

Previous బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు
Next లలిత్ కంగన్ హాల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ADVERTISEMENT