| Daily భారత్
Logo




విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-11 19:12:13

Share: Share


విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

-ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు.

-సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం.

-విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం *సమ్మర్ క్యాంపు* ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజువారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు  ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.


Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >
Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >
Image 1

భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

Posted On 2026-05-11 19:52:59

Readmore >
Image 1

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-11 19:12:13

Readmore >
Image 1

ముస్తాబాద్ మండలంలో బెల్ట్‌షాపుల నిర్వాహకుల బైండోవర్

Posted On 2026-05-11 18:58:49

Readmore >
Image 1

సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

Posted On 2026-05-11 18:35:23

Readmore >
Image 1

"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

Posted On 2026-05-11 18:26:59

Readmore >
Image 1

మద్యం మానుకోవచ్చు... (ఎలానో తెలుసుకోండి)

Posted On 2026-05-11 18:25:28

Readmore >
Image 1

గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

Posted On 2026-05-11 17:23:36

Readmore >