| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముస్తాబాద్ మండలంలో బెల్ట్‌షాపుల నిర్వాహకుల బైండోవర్

ముస్తాబాద్ మండలంలో బెల్ట్‌షాపుల నిర్వాహకుల బైండోవర్

డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు.సోమవారం ముగ్గురు బెల్ట్‌షాపు నిర్వాహకులను ముస్తాబాద్ ఎంఆర్‌ఓ ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ సిహెచ్.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు...

బైండోవర్ అయిన వారిలో చీకోడు గ్రామానికి చెందిన గున్నాల రమేష్ గౌడ్, నామాపూర్ గ్రామానికి చెందిన జలిగం రాజయ్య మరియు యారపు రామస్వామి ఉన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ గణేష్ ఈ సందర్భంగా కోరారు.

Previous సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..
Next విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT