డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సమాజాన్ని తమ రచనల ద్వారా చైతన్యవంతం చేసేది కవులు రచయిత లేనని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేది కవులు రచయితలు కళాకారులేనని అన్నారు. మరిన్ని రచనలు చేస్తూ సాహిత్య ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అని సమాజంలో ప్రశ్నించేది కవులేనని అన్నారు. తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం ప్రశ్నించే తత్వాన్ని పెంచే సాహిత్యం కవులు, రచయితల నుంచి రావాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కొండి మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంగలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వీరగోని చైతన్య గౌడ్, ఆడేపు లక్ష్మణ్, పాకాల శంకర్ గౌడ్, నాగిళ్ల రమేష్, బుర్కా గోపాల్, అలేఖ్య, సౌమ్య, శోభారాణి, అనిత తదితరులు పాల్గొన్నారు.
News
సమాజాన్ని చైతన్యవంతం చేసేది కవులే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్