పోలీసులకే సవాల్ గా మారిన అక్రమ గంజాయి వ్యాపారులు
డైలీ భారత్, మెదక్: గురువారం నాడు డి టి ఎఫ్ బృందం, మెదక్ మెదక్ మున్సిపాలిటీ లోని రాంనగర్ లో పీఅండ్ ఈఐ నరేందర్ దాడులు నిర్వహించారు.
ఒక ఎండు గంజాయి కేసును గుర్తించరూ..
ఎండి. పాషా, S/o అబ్దుల్ నబీ, వయస్సు: 61 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, R/o. మెదక్‌లో అతని ఇంటి వద్ద అక్రమంగా నిలువ చేసుకున్న (150) గ్రాముల ఎండు గంజాయి , (03) గంజాయి మొక్కలు. సొత్తు, కేసు పత్రాలు, అక్రమాస్తులు స్వాధీనం చేసుకొని నిందితుడిని మెదక్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించి మెదక్ సబ్ జైలులో ఉంచారు.
ఈ దాడుల్లో చంద్రయ్య, ఎల్లయ్య, HC c ఈసీలు కె.రాజు, నరేష్, హరీష్, నవీన్, రవి పాల్గొన్నారు.
గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన వారికి తెలియజేయ వలసిందిగా అందరినీ కోరుతున్నాను మరియు వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయి.
ఎండి అబ్దుల్ రజాక్, జిల్లా ప్రొహి బిషన్ మరియు ఎక్సైజ్ అధికారి, మెదక్ జిల్ల తెలిపారు.