| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి

మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి

 మతిస్థిమితం లేని వ్యక్తిని అన్నం ఫౌండేషన్ వారికి అప్పగించిన సుజాతనగర్ పోలీస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో మండలంగత వారం రోజుల నుంచి సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో  గుర్తు తెలియని   వ్యక్తి తిరుగుతూ కనిపించగా సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి  తన సిబ్బంది తో వ్యక్తిని  వివరాలు అడగగా  తుమ్మ భాస్కరరావు   కోనాయిపాలెం గ్రామం నందిగామ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి ప్రస్తుతం మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇట్టి వ్యక్తి గురించి నందిగామ దగ్గర ఉన్న కొనాయిపాలెం గ్రామంలో విచారించగా ఈ వ్యక్తి ఆ గ్రామానికి చెందినవాడు కాదని తెలిసింది.  సుజాతనగర్ ఎస్ఐ  పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి అతనికి నూతన దుస్తులు అందించడం జరిగింది ఆ వ్యక్తిని సంరక్షణ కోసం ఖమ్మం జిల్లా ఖమ్మం కు  అన్నం ఫౌండేషన్  అప్పగించడం జరిగింది. ఇట్టి వ్యక్తి గురించి ఎవరికైనా ఏమైనా వివరాలు  తెలిసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసు  సమాచారం ఇవ్వవలసిందిగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి గారు కోరారు.

Previous రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Next బెట్టింగ్‌కు బానిసై… హత్యాయత్నానికీ వెనుకాడని యువకుడు
ADVERTISEMENT