డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ గాంధీనగర్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎలగొండ రవి జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరము ఈ కవి సమ్మేళనం కార్యక్రమం లో కవులు కవితా గానం చేసారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షులు ఎలగొండ రవి, వెంగళ లక్ష్మణ్, ఆడెపు లక్ష్మణ్, జనపాల శంకరయ్య,కోడం నారాయణ, అంకారాపు రవి గుండెల్లి వంశీ,దూడం గణేష్ మహేష్,రాజేశం, కృష్ణ మూర్తి శర్మ పాల్గొన్నారు