| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు  హెల్మెట్లు అందజేశారు. 

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు

Previous నిజమైన హీరోలు : ప్రాణం నిలిపిన బాన్సువాడ పోలీసులు!
Next చలివేంద్రాన్ని ప్రారంభించిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి
ADVERTISEMENT