| Daily భారత్
Logo




25 వ తేది ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన డిజిపి

News

Posted on 2026-03-23 18:20:17

Share: Share


25 వ తేది ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన డిజిపి

డైలీ భారత్, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి సోమవారం నాడు లోక్ భవన్ లో   కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పోలీసు జట్ల వివరాలను డిజిపి గవర్నర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాల పోలీసు బృందాల గౌరవ వందన స్వీకరణ, క్రీడాకారుల మార్చ్ పాస్ట్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి.  గవర్నర్ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించనుండగా, ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర భద్రతా బలగాల నుంచి అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ వేదిక సిద్ధమైంది. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, స్పోర్ట్స్ ఐజీపీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >