Posted on 2026-03-23 16:25:16
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న ప్రస్తుత ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులు బయోమెట్రిక్ నమోదు మరియు ఫోటో తీసుకునే ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ఎస్సారెస్పీ (SRSP) నీటి విడుదలను వేగవంతం చేసి, రైతుల పంటలకు సమయానుకూలంగా నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు., తన మంత్రిత్వ కాలంలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు మరియు సంబంధిత వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు.జిల్లాలో ఉన్న భూ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పేర్లకు భూములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మన్యు ప్యాట్నీ, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, బాధే నాగయ్య, భద్రు తదితరులు పాల్గొన్నారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >