Posted on 2026-03-23 15:40:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్పనపల్లి గ్రామం, డి.వి. నగర్ కాలనీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన జాఫర్ కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. మొదట ఈ కేసు అనుమానాస్పద మృతిగా నమోదు చేయబడగా, దర్యాప్తు, వైద్యుల అభిప్రాయం, సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల ఆధారంగా ఇది హత్య కేసుగా తేలింది. ఈ కేసులో మృతుడి భార్య ఎస్.డి. ఖతీజా మరియు ఆమెతో అక్రమ సంబంధం కలిగిన షేక్ మీరా సాహెబ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం, ఖతీజా తన భర్త జాఫర్‌తో తరచూ కుటుంబ కలహాలు పడుతూ ఉండేది. ఆమెకు ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన షేక్ మీరా సాహెబ్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధంగా మారింది. తమ సంబంధానికి జాఫర్ అడ్డుగా ఉన్నాడని భావించి,రాత్రి సమయంలో ఇద్దరూ కలసి జాఫర్‌పై దాడి చేసి, దిండు ముఖంపై అదిమిపట్టి, శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. అనంతరం సహజ మరణంలా నమ్మించి ఖననం చేయించినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, ఆధారంగా నేరానికి ఉపయోగించిన AP 37 CT 2050 Bajaj CT100 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు, అలాగే మృతుడిని ఊపిరాడకుండా చేయడానికి ఉపయోగించిన దిండు మరియు చిన్నారిని బెదిరించడానికి ఉపయోగించిన చాకులను పోలీసులు పంచుల సమక్షంలో స్వాధీనం పరుచుకున్నారు.
ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లను, పోస్టుమార్టం వైద్యాభిప్రాయం మరియు సేకరించిన ఆధారాల మేరకు మార్చి, నిందితులపై హత్య తదితర సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకొని న్యాయస్థానంలో హాజరు పరచుటకు చర్యలు చేపట్టినారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీలక్ష్మి, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ సిబ్బంది ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >