Posted on 2026-02-16 13:30:23
చైర్మన్‌గా బసవేశ్వర్, వైస్ చైర్మన్‌గా అందె మోహన్ ప్రమాణ స్వీకారం
శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నేత ఎం.డి. ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం ఘనంగా కొలువుదీరింది. సోమవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్‌గా బసవేశ్వర్, వైస్ చైర్మన్‌గా అందె మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మున్సిపల్ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి షాద్‌నగర్ నియోజకవర్గ స్థాయి నేతలు, పట్టణ ప్రముఖులు పురప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యాలయం ప్రాంగణమంతా కార్యకర్తల కోలాహలం, బాణసంచా సందడితో పండుగ వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్‌లకు సీనియర్ నాయకులు ఎండి ఇబ్రహీం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. షాద్‌నగర్ పట్టణ అభివృద్ధిలో నూతన పాలకవర్గం చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >