Posted on 2026-02-15 15:45:50
మద్దికుంట బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
భక్తుల సౌకర్యం, భద్రతే మా ప్రధాన లక్ష్యం – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS
డైలీ భారత్, కామారెడ్డి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామంలోని బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బుగ్గ రామేశ్వర లింగ ఆలయంలో నిర్వహిస్తున్న రథోత్సవాన్ని జిల్లా ఎస్పీ సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి భక్తుడు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, తాడువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును కూడా జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి, పరస్పర సామరస్యంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >