Posted on 2026-02-06 12:29:13
డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సమాజాల్లో జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు
ఈ సందర్భంగా షీ టీం జిల్లా ఇన్చార్జి ప్రమీల మాట్లాడుతూ...
మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లాలో విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలి మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేరుగా 8712656425 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలోని ఎంపీపీ ఎస్ సముద్ర లింగాపూర్ జెడ్పిహెచ్ఎస్ సముద్రాళింగాపూర్ ఎంపీపీ ఎస్ నాగంపేట జెడ్పిహెచ్ఎస్ నాగంపేట ఎంపీపీ ఎస్ మల్లు పల్లి ఎంపీపీ ఎస్ దమ్మన్నపేట ఎంపీపీ ఎస్ కుర్దులింగంపల్లి ఎంపీపీ ఎస్ ముస్తఫా నగర్ పాఠశాలలు కూడా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రమీల తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో షీ టీం సభ్యులు వీరయ్య శ్రీనివాస్ ప్రియాంక శ్రీలతలు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >